నవతెలంగాణ- నవీపేట్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సఫాయి కార్మికుల సేవలను గుర్తించి పర్మినెంట్ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యేశాల గంగాధర్ అన్నారు. మండల కేంద్రంలో 3వ రోజు నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపుతూ మాట్లాడుతూ.. సఫాయి కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గ్రామీణ వ్యవస్థలో పట్టుకొమ్మలాంటి వారి సేవలో కరోనా సమయంలో యావత్ భారతదేశం గుర్తించిందని అటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్ వాడి శ్రీనివాస్, మేకల ఆంజనేయులు, పోశెట్టి, సాయిబాబా, ఎర్రన్న తదితరులు పాల్గొన్నారు.