మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ 

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామానికి చెందిన బొల్లం నరేశ్ గౌడ్ ఇటీవల మృతి చెందగా శనివారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అనుబంధ కమిటీల నాయకులు అయన వెంట ఉన్నారు.