ఘనంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్  వేడుకలు 

నవతెలంగాణ –  కామారెడ్డి 
హైదరాబాద్ లోని గంప గోవర్ధన్  నివాసంలో బుధవారం  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ ల ఆధ్వర్యంలో కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్  62వ జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో ఆయన చేతులమీదుగా కేక్ కట్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గం పెద్దయెత్తున బిఆర్ఎస్ నాయకులు తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు గంప గోవర్ధన్ కు తెలియజేశారు. అనంతరం శాలువా కప్పి, బొకే తోపాటు  మెమొంటో అందించరు. ఈ సందర్భంగా జూకంటి ప్రభాకర్ రెడ్డి,చెలిమెల భానుప్రసాద్లు మాట్లాడుతూ గంప గోవర్ధన్  మరిన్ని జన్మదిన మహోత్సవాలు జరుపుకొని కామారెడ్డి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజల కు ఎల్లవేళ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారానికి ముందు ఉండే విధంగా సకల దేవతల ఆశీస్సులు ఉండాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కృష్ణ యాదవ్, ఈశ్వర్, సమీర్, బాబాగౌడ్, రాజ్  కుమార్, రంజిత్  తదితరులు పాల్గొన్నారు.