ప్రయివేట్ రంగంలో వచ్చే ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అతిక్ బేగం సూచించారు. బుధవారం కళాశాలలో అప్ గ్రేడ్, టీఎస్.కేసి ఆధ్వర్యంలో హెచ్.డీ.ఎఫ్.సి, యాక్సిస్, ముత్తూట్ ఫిన్ కార్ప్ ఉద్యోగాల కోసం నిర్వహించిన జాబ్ మేళకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని నలు ప్రాంతాల నుండి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా హెచ్ఆర్ లు సీనియర్ మేనేజర్ వినయ్ వారికి ఇంటర్వ్యులు నిర్వహించి విధులు, వేతనం, శిక్షణ తదిరత వాటి గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అతిక్ బేగం మాట్లాడుతూ… డిగ్రీ పాసైన నిరుద్యోగులు ప్రయివేట్ రంగాల్లో వచ్చే అవకాశాలను వినియోగించుకుంటు స్థిరపడాలన్నారు. ప్రయివేట్ సెక్టార్ లో కూడా మంచి వేతనంతో కూడా ఉద్యోగాలున్నాయన్నారు. వాటి గురించి తెలుసుకుంటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా మొత్తం 150మంది నిరుద్యోగులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఇందులో 45 మంది ఇక్కడ ఎంపిక అయ్యారని తెలిపారు. తదుపరి ఇంటర్వ్యూ హెడ్ ఆఫీస్ లో ఉంటుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రఘు గణపతి టీఎస్.కేసీ కోఆర్డినేటర్ కోటయ్య, మెంటర్ చైతన్య కృష్ణ అధ్యాపకులు నరేష్, కృనల్, గోపాల్, పృథ్వీరాజ్, సిబ్బంది ఉన్నారు.