లేబర్ కోడ్ లను రద్దు చేయాలి 

– రద్దు చేసి 26 కార్మిక చట్టాలను  పునరుద్ధరణ చేయాలి
– ప్రజా సంఘాలనాయకుల డిమాండ్ 
– కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మూర్చ ఆధ్వర్యంలో నిరసన
– కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
లేబర్ కోడ్ లను రద్దు చేయాలని రద్దు చేసి 26 కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని ప్రజా సంఘాలనాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మికులకు కర్షకులకు ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను ధర్నా చౌక్ వద్ద కార్మిక సంఘాలు సమయుక్తా కిషన్ మూర్చ ఆధ్వర్యంలో  దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి హనుమాన్లు ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమయ్య ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివ లు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ తీరు చూస్తే ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుందో అర్థం అవుతుందని తీవ్రంగా మండిపడ్డారు. కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచి పెట్టే విధంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బిజెపి మతోన్మాద ఆర్థిక దివాలకోరు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు పేదలు ప్రజల పైన భారాల మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటు అన్నారు. కార్మికుల కనీస వేతనాలు పెంచే ఆలోచన ఈ బడ్జెట్ లో లేదన్నారు ఈ బడ్జెట్ దేశంలో పేదరికం నిరుద్యోగం సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు. బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక ,వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ ఆదాని బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తుందని ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. రాబోయే కాలంలో కార్మిక వర్గం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు ఏ ఐ టి యు సి దేవేంద్ర, చక్రపాణిరైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్ అధ్యక్షులు గంగాధరప్ప, టి యు సి ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్ జిల్లా నాయకులు కిషన్ మురళి రవి విటల్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేష్, సి ఐ టి యు జిల్లా నాయకులు కటారి రాములు రఫీక్ ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు చక్రి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.