
భిక్కనూరు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం కంటి వైద్య నిపుణులు రవీంద్ర పాటిల్ కంటి సమస్యతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్నవారికి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అనంతరం మందులు అందజేసి వైద్యుల సూచనలు సలహాలు పాటించాలని సూచించారు.