సైన్స్ కళాశాలలో జాబ్ మేళాకు స్పందన

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం టీఎస్ కేసి (తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్) ఆధ్వర్యంలో టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) వారి సౌజన్యంతో నిర్వహించిన జాబ్ మేళాను స్పందన లభించింది. ఈ జాబ్ మేళాలో   హెచ్.ఈ.టీ.ఈ.ఆర్.ఓ లాబొరేటరీస్ లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులకు 35 మంది అభ్యర్థులు హాజరవ్వగా, 6 గురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.సంగీత తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ కే సి కోఆర్డినేటర్ డాక్టర్. ఐ శ్రావణి, కంపెనీ హెచ్.ఆర్ ప్రతినిధి విజయ్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ జగ్రామ్ అంతర్వేది,  టీఎస్ కే.సి మెంటార్ ఎండి. ఇమ్రాన్ అలీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.