
30 సంవత్సరాల స్ఫూర్తితో ముందుకు సాగిన మందకృష్ణ మాదిగకు, మాదిగలకు బుధవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. జటిలమైన సమస్య పరిష్కారం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సభలో సభ్యునిగా ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు.