ఇమినేషన్ కార్యక్రమం పరిశీలన

నవతెలంగాణ – రాజంపేట్ ( భిక్కనూర్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని తిప్పాపూర్, తలమడ్ల గ్రామాలలో ఇమినేషన్ కార్యక్రమాన్ని హెల్త్ సూపర్వైజర్ మంజూరు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ రికార్డు పరిశీలన, టీకాల వివరాలు, గడుపు తేదీలు పరిశీలించి క్రమం తప్పకుండా పిల్లలకు టీకాలు వేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గంగమణి, సంగీత, ఎ ఎన్ ఎం చంద్రకళ, యాదమ్మ, కవిత, మంజుల, ఆశలు తదితరులు ఉన్నారు.