స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి: టీజీవిపి

నవతెలంగాణ – భిక్కనూర్
విద్యార్థుల స్కాలర్షిప్ లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద టీజీవీబీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ  పెండింగ్ లో ఉన్న 7 కోట్ల 78 లక్షల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్నటువంటి లక్ష 91 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. విద్య శాఖ మంత్రిని నియమించి, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ఖాన్, కార్యకర్తలు నిశాంత్, సందీప్, యోగేష్, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.