ఎన్నికల్లో అన్ని కులాలకు సమాన వాట కాంగ్రెస్ లక్ష్యం 

– పాలడుగు వెంకట కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు 
నవతెలంగాణ-గోవిందరావుపేట 
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరా గాంధీ విగ్రహం వద్ద  మండల కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన రవి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక మహోత్సవ కార్యక్రమానికి మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం సమాన వాటా కల్పిస్తూ, అసెంబ్లీ ఆమోదం తెలిపిన శుభ సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క  చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా పాలన యావత్తు భారత దేశానికే ఆదర్శం అని, ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, మంత్రి సీతక్క కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చాక సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, కులాల ప్రకారం కుల గణన చేసి, జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో, ఎన్నికల్లో సమాన వాటా కల్పిస్తూ, బీసీలకు 46.25% వాటాను కల్పించిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మంత్రి సీతక్క  చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే అత్యత్తమ పథకాలతో రైతులకు గిట్టుబాటు ధర, రెండు లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసా ద్వారా ఎకరానికి సంవత్సరానికి 12000/- రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఎన్నో పథకాలతో పేదరిక నిర్మూలన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దూసుకుపోతుంది అని, దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రాలన ఆదర్శం అని అన్నారు. అన్ని వర్గాల, కులాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి గ, కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరి ప్రసాద్, గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.