నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: భవన నిర్మాణ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం మల్కాజ్గిరి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు.చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో బుధవారం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు సంఘటితంగా ఉండి సమిష్టి నిర్ణయంతో పనిచేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు కూడా ఎనిమిది గంటల పని దినం పాటించాలని ఎండి పాషా అన్నారు.కార్మికులకు ప్రమాదదాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పని చేయించుకుంటున్న యజమానులు గాని ప్రభుత్వం కాని స్పందించకపోవడం వల్ల కార్మికులే సంఘటితంగా ఉండి పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు.నష్టపరహారాలను కార్మికులు సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వ అధికారులు కూడా సానుకూలంగా భవన నిర్మాణ కార్మికుల పట్ల స్పందించి ప్రమాదాలు జరిగినప్పుడు విశాల హృదయంతో నిర్ణయాలు తీసుకొని కార్మికలపై సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి అంజయ్య బదుల మల్లయ్య చిలువేరు బిక్షపతి యాదగిరి మల్కాజ్గిరి బిక్షపతి దౌడీ పాండు చామట్ల శంకర్ పార్టీ సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు