మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ జ్యువెలరీ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేయగా షాప్ నిర్వాహకులు పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎర్రబెల్లి రిబ్బన్ కట్ చేసి జ్యువెలరీ షాపును ప్రారంభించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ మండల కేంద్రంలో బంగారం షాపును ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో బంగారం షాపు ఉండడం చాలా మంచిది అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లా సుధీర్ రెడ్డి,ఆకుల సురేందర్ రావు, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎండి నాయిమ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పూస మధు తదితరులు పాల్గొన్నారు.