– బ్యాటర్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లోకి…
– ఐసీసీి టి20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, కెరీర్‌లో తొలిసారిగా అత్యుత్తమ స్థానానికి ఎగబాకారు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టి20లో అభిషేక్ శర్మ సెంచరీ, రెండో టి20లో తిలక్ వర్మ అర్ధసెంచరీలతో రాణించారు. దాంతో అభిషేక్ శర్మ ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఒకేసారి 38 స్థానాలు ఎగబాకి.. రెండో స్థానానికి చేరుకున్నాడు. అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 855 రేటింగ్ పాయింట్లతో టీ20 నెంబర్ బ్యాటర్‌గా ట్రావిస్ హెడ్ కొనసాగుతుండగా.. అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండోస్థానం, తిలక్ వర్మ 803 రేటింగ్ పాయింట్లతో మూడోస్థానం, ఫిల్ సాల్ట్ 798 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 738 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, బాబర్ అజామ్, పాతుమ్ నిస్సాంక, మహ్మద్ రిజ్వాన్, కుశాల్ పెరెరా ఉన్నారు. అభిషేక్ శర్మ తొలిసారిగా కెరియర్‌లోనే తొలిసారిగా నెంబర్ 2కి చేరడంతో రెండు నుంచి 9వ ర్యాంక్ వరకు ప్రతి క్రికెటర్ ఒక్కో ర్యాంకులు దిగజారాయి. ఇదిలా ఉండగా.. మరో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మూడో స్థానాలు కోల్పోయి టాప్10లో చోటు దక్కించుకోలేకపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం 12వ ర్యాంకులో ఉన్నాడు. ఇక టి20 బౌలర్ల ర్యాంకింగ్‌లో వరుణ్ చక్రవర్తి తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్.. మూడు స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ రెండోస్థానంలో ఉన్నాడు. వరుణ్ 705 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్‌కు చెందిన అకిల్ హుస్సేన్ 707 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. హసరంగా నాలుగో స్థానంలో, ఆడమ్ జంపా ఐదో స్థానంలో, భారత బౌలర్ రవి బిష్ణోరు ఆరో స్థానంలో ఉన్నాడు. టాప్-10లో ముగ్గురు భారత బౌలర్లు ఉన్నారు. వరుణ్, బిష్ణోరు, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. అర్ష్‌దీప్ ఒక స్థానం దిగజారి.. తొమ్మిదో ప్లేస్‌కి పడిపోయాడు. అక్షర్ పటేల్ 11వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాడు.