–
దుబ్బాక, లచ్చపేటలో ఘనంగా మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు

– మహంకాళి, వాసవి మాతా అమ్మవార్లకు మెదక్
– ఎంపీ ప్రత్యేక పూజలు
– అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
నవతెలంగాణ -దుబ్బాక /దుబ్బాక రూరల్
ఆషాడ మాసం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుబ్బాక పట్టణం తో పాటు లచ్చ పేటలో శనివారం మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి పంచామృత అభిషేకము, అలంకరణ, కుంకుమార్చన, బోనాల ఉత్సవాలు నిర్వహించారు.మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. ఐతే ఈ ఉత్సవానికి ఎంపీ కొత్త ప్రబాక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీని శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి కరుణా కటాక్షాలు నియోజక వర్గ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.ప్రతి ఆషాడ మాసంలో బోనాల పండగ నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ అని పేర్కన్నారు. అంతక ముందు దుబ్బాక పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో మెదక్ ఎంపీ వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో 10 వార్డ్ కౌన్సిలర్ కూరపాటి బంగారయ్య,11 వ వార్డ్ కౌన్సిలర్ నంద్యాల శ్రీజ శ్రీకాంత్, వార్డ్ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు , భక్తులు ఉన్నారు.