నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : భూ తగాదాల్లో అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎర్ర ఎల్లయ్య (62) హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే… ఐతే శనివారం మృత దేహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకవచ్చి దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ ఆధ్వర్యంలో అక్బర్ పేట్ భూంపల్లి ఎస్ ఐ గంగరాజు, దుబ్బాక ఎస్ ఐ మహేందర్, మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ లతో పాటు 50 మంది పోలీసుల బందోబస్తు నడుమ ఎల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య కక్షలు ఉండటంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.