విశ్వ మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు

నవతెలంగాణ – అచ్చంపేట : విశ్వ మానవ సంక్షేమ సంఘం, నల్లమల్ల బాలోత్సవం  వారి ఆధ్వర్యంలో  ఉప్పునుంతల మండలం పెనిమిళ్ళ, తిప్పాపూర్, కోరిటి కల్, రాయిచెడ్ గ్రామాలలో ఉచిత ట్యూషన్  సెంటర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో వ్యవస్థాపకులు మస్తాన్ రావు పెసల మాట్లాడుతూ ఈ సంస్థ 1987 లో స్థాపించబడింది అని, దీని ప్రధాన ఉద్దేశం పెరుగుతున్న జనాభా, సమాజంలో పెరుగుతున్న హింస, స్త్రీల పై అత్యాచారాలు, కుల మత ఘర్షణలు, పేద వారిలో పొదుపు యొక్క అవశ్యకతను చెప్పటం, పర్యావరణ పరిరక్షణ, చేతబడులు, బాణామతి, మూఢ నమ్మకాలు మీద ప్రజలలో చైతన్యం తీసుకు రావడం. ఉచిత ట్యూషన్  సెంటర్లు పెట్టి పిల్లలలో నైతిక విలువలు, మానవత్వం, క్రమ శిక్షణ, సమయ పాలన,భారతీయ సంస్కృతి, నాగరికత చెప్పడం జరుగుతుందన్నారు.
 పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దలనీ ప్రయత్నిస్తూ ఉన్నామని చెప్పారు.  అలాగే చేనేత, చేతివృత్తుల మీద, స్వదేశీ వస్తు జాగరణ, స్వచ్ భారత్, ట్రాఫిక్ సమస్యల లాంటి వాటి మీద రాలీలు చేస్తామని తెలిపారు  ప్రారంభోత్సవ సందర్భంగా పిల్లలతో మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పకూడదని, మోసాలు చేయకూడదని, పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని , చెడు స్నేహాలు మానాలని, మొబైల్ ఫోన్లు వీలున్నంత తక్కువగా వాడాలని, పెద్దలను గౌరవించాలని చెప్పారు. పిల్లలందరూ కొట్లడుకోకుండ స్నేహపూరిత వాతావరణం లో బాగా చదువు కావాలని సూచించారు. పెద్దలను, తల్లితండ్రులను గౌరవించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ, భగత్ సింగ్, సుఖదేవ్, పొట్టి శ్రీరాములు,ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహానుభావుల చరిత్రలు చదవాలని చెప్పారు.  డార్విన్, థామస్ ఎడిసన్, సివి రామన్, జగదీష్ చంద్రబోస్  లాంటి శాస్త్ర వేత్తలు చరిత్రలు చదివి పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు కావాలని, నోబుల్ ప్రైజ్ లు లాంటి పెద్ద పెద్ద బహుమతులు పొందాలని, భారతీయులు మంచి ఉన్నతమైన గుణాలు కలిగి మన దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో విశ్వ మానవ సంక్షేమ సంఘం కోశాధికారి ఇబ్రహీం, ఎడిటర్, ఎంప్లాయీస్ వాయిస్, తెలంగాణ K. వేంకటేశ్వర రావు  , రామావత్ లక్ష్మణ్ , కన్వీనర్, జిల్లా బాలోత్సవం పాల్గొన్నారు.