సమ్మక్కసారక్క ఆలయం వద్ద సదుపాయాలు కల్పించాలని వినతి

నవతెలంగాణ -పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పొట్టిచలిమ వద్ద చిన మేడారం గా పిలువబడే సమ్మక్కసారక్క ఆలయం వద్ద మెరుగైన సదుపాయాలు కల్పించాలని సాగర్ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కి ఆలయ ధర్మకర్త గుంజా అంజమ్మ, కార్యదర్శి నాగపురి లక్ష్మి రామస్వామి గురువారం వినతిపత్రం అంద జేశారు.ఈసందర్బంగా ఈ నెల 12 నుండి ఫిబ్రవరి 15 2025 వరకు జరుగు జాతరజరుగుతుందని అమ్మవారు వెలసిననాటి నుండి పూజారులుగా ఉంటూ ఆ తల్లులనే ఆరాధిస్తూ దేవస్థానం గద్దె పక్కననా నివాసం నిర్మించుకొని ఎన్నో సంవత్సరములుగా అమ్మవారలకు అర్చన చేస్తూ జీవిస్తున్నామని తెలిపారు.ప్రతి సంవత్సరం జాతరకు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం సమ్మక్క సారక్క గద్దెల చుట్టు ప్రదక్షణాలు చేయుట కొరకు సిసి, బండలు,జాతరకు వచ్చే భక్తులకు స్నానానికి, త్రాగునీతి వసతి కల్పించాలని కోరారు. అలాగే స్నానాలగధులు, మరుగుదొడ్లు,భక్తులు అమ్మవారి నైవేద్యం తాయారు చేయుటకు, వంట చేసుకోనుటకు వంటషెడ్లు నిర్మించుటకు సహాయం చేయాలని కోరారు.జాతరకు వచ్చే భక్తులకు రాత్రి వేళలో ఇబ్బందులకు గురికాకుండా ఉండుటకు విద్యుత్ దీపాలు అమరచ్చుటకు సహకరించగలరని తెలిపారు.జాతర సమయంలో యే గొడవలు జరగకుండా పోలీసు శాఖవారికి శాంతి భద్రతలకు రక్షణ కల్పించాలని తెలిపారు.అలాగే ఆటవి శాఖవారి యొక్క సహాయ సహకారాలు మాకు అందే విధముగా ఆదేశాలు జారిచేయగలరని ఎంఎల్ ఏ తో కోరారు.