నవతెలంగాణ డిచ్ పల్లి
ఫిబ్రవరి 10 న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం లో బాగంగా 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరంల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని, ఒక సంవత్సరం పిల్లలకు పైబడిన పిల్లలకు ఒక మాత్ర అనగా 400 మిల్లీగ్రాములు మాత్ర వేయాలని, ఫిబ్రవరి 10 తేదీన తప్పిపోయిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఫిబ్రవరి 17వ తేదీన తిరిగి మాత్రలు వేయాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పేర్కొన్నారు.గురువారం డిచ్ పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం లో ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల కు చెందిన ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆరోగ్య, ఆశా కార్యకర్తలకు జాతీయ నులిపురుగుల నివారణ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ మాట్లాడుతూ నులి పురుగులు అనునవి ఎస్టిహెచ్ (STH)అనగా సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెంతియాసిస్ (Soil Transmuted Helmenthiasis) అంటారని వివరించారు.
మట్టి ద్వారా వ్యాపించే వ్యాధి కావున బహిరంగ మలవిసర్జనను బహిష్కరించాలని తెలిపారు. బహిరంగంగా మలవిసర్జన చేసినట్లయితే పాదరక్షలు లేకుండా బయట తిరిగినప్పుడు కాలు ద్వారా నులిపురుగు శరీరంలోకి ప్రవేశిస్తుందని చిన్నపిల్లలు మట్టిలో ఆడుకున్నట్లయితే గోర్ల ద్వారా నోటి ద్వారా శరీరంలోకి నిలుపురికి ప్రవేశిస్తుందని తద్వారా పిల్లలకు పోషకాహార లోపము రక్తహీనత లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని తెలియజేశారు. పిల్లలకు చేతులు కడుక్కునే పద్ధతులను నేర్పాలని పిల్లలు కచ్చితంగా చేతులు కడుక్కుని నీటిని తాగాలని చేతులు కడుక్కున్న తర్వాత ఆహార భుజించాలని, వన్డే కూరగాయలను శుభ్రంగా కడగాలని, చేతులు శుభ్రంగా కడిగి వండించాలని, ఆహార పాత్రలపై మూతలు ఉంచాలని, పిల్లలకు మరుగుదొడ్లు అలవాటు చేయాలని, పై విషయాలన్నిటిని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ సుశాంత్ రెడ్డి, డిచ్పల్లి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఆరోగ్య బోధకురాలు స్వామి సులోచన, ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు దేవపాల, రాజేందర్, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.