రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని  ముస్త్యాలపల్లి  గ్రామానికి చెందిన రైతు  వడ్డే రాములు(55)  అనారోగ్యంతో మృతిచెందగా, గురువారం వారి  కుటుంబానికి చందుపట్ల బ్యాంకు తరపున 30000 ఆర్థిక సహాయాన్ని చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి అందజేశారు. ఈ  కార్యక్రమంలో సంఘం డైరెక్టర్ గంధమల్ల  వెంకటేశ్వర్లు, సంఘ సిబ్బంది సీఈఓ నల్లమాసు రాములు, గుర్రం నాగరాజు, బోడ సంజీవ, సభ్యులు, రైతులు పాల్గొన్నారు.