
నవతెలంగాణ డిచ్ పల్లి : ఎస్సీ వర్గీకరణకు బిఆర్ఎస్ మద్దతు తెలపకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కసుతో వాక్ అవుట్ చేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ ఇందల్ వాయి మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ అన్నారు.గురువారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ దళితులకు సంబంధించి రాబోయే కాలంలో ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయపరంగా ఏం చేస్తే భాగుంటుందో కేటిఆర్ అలోచిస్తారని బావిస్తున్నామని, కానీ ఇలా చేస్తారని అనుకోవడంలేదని అందుకు నినన్నటి సంఘటనే గుర్తు చేసింది. పేద ప్రజలు బాగుపడం ఇష్టం లేకనే శాసనసభను బిఆర్ఎస్ బహిష్కరించిందని ఎద్దేవా చేశారు.ఎస్సీ వర్గీకరణతో పాటు కీలకమైన బి.సి. కులగణన పై చర్చ జరుగుతుంటే సభకు రండి అని మా ముఖ్యమంత్రి చెప్పిన కేసిఆర్ రాకపోవడం దురదృష్టకరం. పేదలు బాగుపడటం బిఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు. తెలంగాణ వస్తా రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి చేస్తానని, బీసిలకు బిసి బందు అమలు చేస్తానని రకరకాలుగా మోసం చేశారు. తమ నాయకులు రాహుల్గాంధీ, సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేయడమే కాకుండా ఎస్సీ వర్గీకరణకు కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతం చెప్పిందని, అందుకు పూర్తి మంత్రివర్గానికి యావత్ రాష్ట్రం అభినందనలు తెలుపుతుందని వివరించారు.