గ్రామీణాభివృద్ది శాఖలోని  నియామకాలపై స్పష్టతనివ్వాలి

– మైనారిటీ జిల్లా అద్యక్షులు ఎండి యాకూబ్ పాషా 
నవతెలంగాణ – పాల్వంచ : కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ క్రింద స్థాపించబడినట్లు చెబుతున్న నేషనల్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ రీక్రీయేషన్ మిషన్ (ఎన్‌.అర్.డి.ఆర్.ఎం)  అనే సంస్థ పరిధిలో ఉమ్మడి రాష్ట్రాల్లో నియామకాలు చేపడుతున్నట్లు వచ్చిన ఉధ్యోగ  ప్రకటనలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షుడు ఎండి.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుండి పలు దినపత్రికలలో ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలోని పలు విభాగాల్లో 13,762 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యోగ ప్రకటనలు రావడంతో స్పందించిన నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ చేసుకోవటానికి ఒకపక్క సిద్దమవ్వగా, మరో పక్క  ఈ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఫేక్ అని పలు పత్రికా సంస్థల ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు వస్తున్నాయని, ఈ నియామకాల పట్ల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేసి స్పష్టతనిచ్చి, నిరుద్యోగులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని, లేని యెడల రాష్ట్రంలోని నిరుద్యోగుల వివరాలు సైబర్ నేరగాళ్ళ పరిధిలోకి వెళ్ళే ప్రమాదముందని హెచ్చరించారు.