పాఠశాలల సందర్శన

నవతెలంగాణ-మల్హర్ రావు/మహాముత్తారం : మహా ముత్తారము మండలంలోని గొల్ల పల్లి,గండి కామారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారి పాశం సంజీవరెడ్డి గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలల్లో మద్యాన్న భోజనం అమలు తీరు, ఉపాధ్యాయుల మోడల్ లెస్సన్ లను,రిజిస్టర్ లను పరిశీలించారు.ఉపాధ్యాయుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని,అభ్యాసన సామర్థ్యాలు పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.కృత్యాథార పద్ధతి లో బోధించాలన్నారు.బడికి రాని పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెలిశోజు బుచ్చి రాములు,పంజాల అశోక్,మౌనిక,పాల్గొన్నారు.