నవతెలంగాణ-భిక్కనూర్ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న బాంబే క్లాత్ హౌస్ యజమాని లాల్ పుట్టినరోజు సందర్భంగా స్పోర్ట్స్ డ్రెస్ గురువారం వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు తన వంతు సహకారంగా స్పోర్ట్స్ డ్రెస్ వితరణ చేసినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, బాంబే క్లాత్ హౌస్ ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.