పచ్చి పాలతో ఫేస్‌ ప్యాక్‌

Face pack with raw milkఏ వాతావరణంలోనైనా, చర్మానికి సంరక్షణ చాలా అవసరం. కాలుష్యం వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఇలాంటి చర్మానికి పచ్చిపాలతో చేసుకునే ఫేస్‌ ప్యాక్‌ సంరక్షణ నిస్తుంది.
పచ్చి పాలు చర్మానికి చాలా మంచివి. దీనితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఎండిపోయినట్లుగా ఉండి, నిర్జీవంగా కనిపిస్తున్న చర్మం గలవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. ఇందుకోసం అవసరమైన పదర్థాలేమిటో చూద్దాం.
రెండు స్పూన్ల పచ్చి పాలు, అర స్పూను పసుపు పొడి, ఒక స్పూను చక్కెర, కొద్దిగా కాఫీ పొడి, గోధుమ పిండి.
ప్యాక్‌ తయారీ విధానం
ఈ ఫేస్‌ ప్యాక్‌ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలు తీసుకోండి. అందులో పసుపుకొమ్ముల నుంచి తీసిన ఒరిజినల్‌ పసుపు అర చెంచా, ఒక చెంచా చక్కెర వేసి కలుపుకోండి.
చక్కెర కరిగాక అందులో కాఫీ, గోధుమ పిండి వేసి బాగా కలపండి.
కాస్త ఎక్కువసేపు తిప్పడం వల్ల బాగా కలిసి మిశ్రమం గట్టి పేస్ట్‌లా మారుతుంది. దీన్ని ముఖంపై అప్లయి చేసుకోవాలి.
అలా వేసుకున్న ఫేస్‌ ప్యాక్‌ను కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి.
ఆ తర్వాత చన్నీళ్లతో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే… ముఖం కాంతివంతంగా అవుతుంది.