ఎయిర్‌టెల్‌కు ‘టారిఫ్‌’ల ఫలాలు

Fruits of 'tariffs' for Airtel– క్యూ3 లాభాల్లో ఐదు రెట్ల వృద్ధి
న్యూఢిల్లీ: ప్రయివేటు టెల్కోలు గతేడాది జులైలో భారీగా పెంచిన టారిఫ్‌ ఛార్జీలు వాటి ఖజానాను కళకళలాడేలా చేస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ 21 శాతం వరకు పెంచిన టారీఫ్‌లతో కంపెనీ లాభాలు బహుళ రెట్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో సంస్థ నికర లాభాలు ఐదు రెట్లు పెరిగి రూ.16,134.6 కోట్లకు ఎగిశాయి. 2023-24 ఇదే క్యూ3లో రూ.2,876.4 కోట్ల లాభాలు నమోదు చేసింది. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రయివేటు టెల్కోగా ఉన్న ఎయిర్‌టెల్‌ క్రితం క్యూ3లో 19 శాతం వృద్ధితో రూ.45,129.3 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.37,899 కోట్ల రెవెన్యూ నమోదు చేసింది. టారిఫ్‌ల పెంపునతో సగటు వినియోగదారుడి నుంచి రాబడి (ఎఆర్‌పీయూ) 17.78 శాతం వృద్ధితో రూ.245కి పెరిగింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.208 ఎఆర్‌పీయూ నమోదయ్యింది. గురువారం బీఎస్‌ఈలో భారతీ ఎయిర్‌టెల్‌ షేర్‌ 2.47 శాతం తగ్గి రూ.1,619.55 వద్ద ముగిసింది.