రైల్వే స్టేషన్లో ట్రైన్లలో దొంగతనాలకు నివారణ చర్యలు చేపట్టాలి 

– ప్రయాణికులు క్షేమంగా గమ్యానికి చేరుకునేలా చూడాలి 
– రైల్వే సిబ్బందికి సూచించిన రైల్వే డిఎస్పి శ్రీనివాస్ రావు 
నవతెలంగాణ కంఠేశ్వర్ 
నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో ట్రైన్లలో దొంగతనాలను జరగకుండా చూడాలని, దొంగతనాల నివారణకు రైల్వే పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ రైల్వే డి.ఎస్.పి శ్రీనివాస్ రావు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ లో భాగంగా రైల్వే డి ఎస్పి కె. శ్రీనివాస్ రావు హైదరాబాద్, ఏ.శ్రీనివాస్ సి.ఐ హైదరాబాద్ నిజామాబాదు రైల్వే పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది తో మాట్లాడి ట్రైన్లలో దొంగ తనాలు జరగ కుండా ప్రయాణికులు క్షేమంగా గమ్యానికి చేరుకునేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. ఎప్పటికప్పుడు రైల్వే స్టేషన్ లో నిఘా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రైల్వే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరు హాజరయ్యారు.