
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో 2008-09 పూర్వ విద్యార్థులు చేయూతనందించారు.శుక్రవారం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం సుమారు రూ.25 వేల విలువైన నీటి శీతలికరణ యంత్రం అందజేశారు.పూర్వ విద్యార్థులు పైడి నాగరాజు, ఎండీ అజారుద్దీన్,పంతం మనోజ్, బండిపెల్లి ప్రవీణ్, శ్రీరాముల హరీష్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శానగొండ శరత్, బీవీఎఫ్ నాయకుడు నిషాని సురేశ్, బోధన సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.