
ప్రతి ఉపాధ్యాయుడు విద్యాబోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించితే విద్యార్థులు పోటీ ప్రపంచానికి దీటుగా ఎదుగుతారని సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం మాణిక్ బండర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తెలుగు ఉపాధ్యాయుల ఇంటరాక్టివ్ పానెల్ బోర్డ్ సాంకేతిక శిక్షణ కార్యక్రమాన్ని ఆయన అకాడమిక్ మోడరింగ్ ఆఫీసర్ జీవన్ తో కలిసి సందర్శించారు. ఏ ఎం ఓ జీవన్ మాట్లాడుతూ.. సాంకేతికత ఉపాధ్యాయులను బలోపేతం చేస్తుందని అన్నారు. శిక్షణ కార్యక్రమానికి స్టేట్ రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించిన ఘనపురం దేవేందర్ ఉన్నత పాఠశాలలో ప్రవేశపెట్టిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డులను ఎలా వినియోగించుకోవాలో, చాక్ పీస్ వాడకుండా ఎలా బోధించాలో , సబ్జెక్టుకి సంబంధించిన ఆడియో వీడియో ఇమేజ్లను ఎలా వాడాలో సమగ్రంగా వివరించారు. మరో రాష్ట్ర రిసార్ట్స్ పర్సన్ శివ నాగమణి లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సులను ఉపయోగించి విద్యార్థులకు ఆసక్తికరంగా ఎలా బోధించాలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కోర్స్ డైరెక్టర్ భారతి, ఆర్ యు పి పి తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి కెవి రమణ చారి, డాక్టర్ గంట్యాల ప్రసాద్, డాక్టర్ కాసర్ల, గోవర్ధన్, గంగాధర్ , గంధం విజయలక్ష్మి, కె సి లింగం, ఆల్గోట్ గంగాధర్, దస్తగిరి, కోకిల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.