
జుక్కల్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు రమా బాయ్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూల మాల వేసి శుక్రవారం నా ఘనంగా నివాళ్లు అర్పించిన జిల్లా సిఐటియు నాయకులు సురేష్ గొండ. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం అనంత్రం *సురేష్ గొండ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ. ఆ రోజులలో త్యాగమూర్తి ఎవరైనా ఉన్నారంటే అది కూడా ఒక తల్లిలా అంబేద్కర్ గారిని ఉన్నత విద్య అభ్యసనలకు ప్రోత్సహించిన మహా త్యాగశీలి రమాబాయి అంబేద్కర్ గారు, అనేక కూలి పనులకు వెళ్లి అనేక కష్టాలు అనుభవించి డబ్బులు సంపాదించి అంబేద్కర్ గారి చదువులకు పంపించి అంబేద్కర్ గారిని ఉన్నత స్థాయిలో ఉంచిన గొప్ప వీరవనిత కుటుంబంలో అనేక ఇబ్బందులు తినడానికి తిండి లేకపోయినా వేసుకోవడానికి బట్టలు లేకపోయినా కుటుంబంలో అనేక వ్యాధిగ్రస్తులైన పట్టించుకోకుండా పనిచేసి సేకరించిన డబ్బులను అంబేద్కర్ గారి విద్యాభ్యాసనకు ఖర్చుపెట్టి ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతగా ఉన్నారంటే అది కేవలం అంబేద్కర్ గారి వెనుకోండి నడిపించిన గొప్పతల్లి అని అయినా అన్నారు.. అదేవిధంగా పలువురు మాట్లాడుతూ సి.హెచ్ గంగారం BSP మాట్లాడుతూ ఆనాడు ఒక భార్య లాగా కాకుండా ఒక తల్లిలా ఆదరించి ముందుకు నడిపించిన గొప్ప నాయకురాలు రమాబాయి అంబేద్కర్ గారు అని అన్నారు ఈ కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, SFI మండల అధ్యక్షులు షైక్ ఫిర్దోస్, SFI నాయకులు రాహుల్, మహేష్, అఫ్రూస్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు కంబ్లే కిషన్, నాయకులు, గజానంద్, సాయినాథ్,భాను ప్రసాద్, సునీల్,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.