
మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామానికి చెందిన ధ్యానదంపతులు బద్దం రజిత దేవేంధర్ వారి ఇంటివద్ద నూతనంగా నిర్మించే ధ్యానమందిరానికి నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ఆశయసాధనలో భాగంగా పిరమిడ్ నిర్మాణాన్ని చేస్తున్నామని బద్దం రజిత దేవేంధర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వందకుపైగా ధ్యానులు పాల్గొన్నారు.