జన్మదినం సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ 

నవతెలంగాణ – బొమ్మలరామరం
మండలంలోని తిమ్మాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూగల రఘునందన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నూతన స్టేజి సుమారు మూడు లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించి శుక్రవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిరుపేదల ప్రజలకు బట్టలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ బుక్స్ ప్యాడ్స్, పెన్నులు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవ అవలంబించుకోవాలని వారి తండ్రి ప్రతాప్ రెడ్డి చేసిన సేవలను చిన్నతనం నుండే చూస్తూ అవలంబించుకున్నానని అన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన ఊరుకు చదువుకున్న పాఠశాలకు ఏదో ఒక విధంగా సేవ చేసే గుణం అవలంబించుకోవాలని అన్నారు. తన 60వ జన్మదిన వేడుకలను తను చిన్నతనంలో చదువుకున్న పాఠశాలలో పిల్లలతో జరుపుకోవడం సంతోషకరంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఎంఈఓ రోజా రాణి, గ్రామస్తులు నాశమైన వెంకటేష్, దండు యాదగిరి, తునికి మహేష్,కాశమైన కనకరాజు, శ్రీశైలం, పాశం ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.