విలేకరులపై వచ్చిన యూట్యూబ్ వార్తలకు సిపిఐ కి సంబంధం లేదు…

– విలేకరులు ఎలాంటి భూకబ్జాలు చేయలేదు…
– యూట్యూబ్ లో వచ్చిన వార్త నిజం కాదు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండల విలేకరులపై ప్రభుత్వ భూమి కబ్జా చేస్తున్నారని యూట్యూబ్ లో వచ్చిన వార్తకు సిపిఐ కి సంబంధం లేదని యూట్యూబ్ లో మాట్లాడిన వ్యక్తి చిలుక రాజేంద్రప్రసాద్ మా పార్టీ కాదని సిపిఐ జిల్లా సహాయ  కార్యదర్శి మద్దెల ఎల్లేష్ అన్నారు.శుక్రవారం ధర్మసాగర్ సిపిఐ గ్రామ శాఖ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు ఎల్లేష్  ఇచ్చేసి మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ లో విలేకరులు ప్రభుత్వ భూమి కబ్జా చేశారని మాట్లాడిన వ్యక్తి చిలుక రాజేందర్ ప్రసాద్ మా పార్టీ కాదని ఏలాంటి భూ కబ్జా జరగలేదని,ప్రభుత్వ అధికారులే భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని,మండల విలేకరులకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వవలసిందేనని అన్నారు.
 సిపిఐ పార్టీగా మేము ఎన్నో పోరాటాలు చేస్తున్న వాటికి మద్దతుగా విలేకరులు పూర్తి సహకారం అందించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.గురువారం నాడు  సర్వే1058 మండల అధికారులు ప్రభుత్వ భూమికి సరి హద్దులు పెట్టిన విషయంలో విలేఖరులే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని,ఏ ప్రింట్ మీడియా గానీ,ఎలక్ట్రానిక్ మీడియాలో గాని సిపిఐ పార్టీగా మేము ఈ మాట అనలేదని తెలిపారు. ఇది కావలసి చేసినా పని కాదా అని,ఎవరైనా మిమ్ముల కించపరిచిన విధంగా మాట్లాడిన వ్యక్తులు ఉంటే మా పార్టీకి సంబంధం లేని తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో మేము మీకు పూర్తి సహకారం అందిస్తామని,అదేవిధంగా మీరు మాకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. గత 2008 సంవత్సరం నుండి ధర్మసాగర్ మండలం గ్రామంలోని ప్రభుత్వ భూమి మూడు ఎకరాల ప్రభుత్వ భూమిలో జెండాలు పాతి సర్వే నంబర్ 10 58లో గుడిసెలు వేసుకొని చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాం అంతకు ముందు నుండే ప్రైవేట్ వ్యక్తులు 10 59 సర్వే నెంబర్ గల ప్రైవేటు వ్యక్తి  మా సీనియర్ నాయకులపై కేసులు   వేసిన వారిలో సిపిఐ సీనియర్ నాయకులు బట్టు మల్లయ్య , కుమ్మరి అంకుష్ చిలుక దేవదాస్ గార్ల మీద కేసులు వేయడం జరిగిందన్నారు.చివరకు పేదల పక్షాన తీర్పు ఇవ్వడం జరిగినది.అట్టి భూమిలో మా పేదలకు చెందాలని లేని పక్షంలో భూ పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కొట్టే వెంకటేష్ చిలకబాబు,చిలుక దేవదాస్,సిపిఐ సీనియర్ నాయకులు బట్టు మల్లయ్య , వల్లెపు సారయ్య,సాయి పేట కొమురయ్య, పల్లపు వెంకటయ్య,కొట్టే లింగయ్య తదితరులు పాల్గొన్నారు.