“ఉపాధి” పై ఇందిరమ్మ ఆత్మీయ బరోసా దెబ్బ…

– పలు కారణాలతో జాబ్ కార్డులకు కోత….
– నిర్వీర్యం కానున్న ఎంజీ ఎన్ఆర్ ఈజీఎస్…
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయ కూలీలు గా మారిన భూమిలేని నిరుపేదలు కు ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఆత్మీయ బరోసా పధకం ముడి పెట్టడంతో ఉపాధి కూలీలకు గడ్డుకాలం రానుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కూలీలను పరిగణించాలని కి ఉపాధి కూలీ గత ఆర్ధిక సంవత్సరంలో కనీసం 20 రోజుల పనిదినాలు అర్హతగా గుర్తించి పధకం అమలుకు రూపకల్పన చేయడంతో ఉపాధి పని రాని,ఇతర రోజువారీ పనులు చేసే పేదలు అనర్హులు గా మారారు. అంతే గాకుండా ఈ పధకం ఉపాధి పధకం తో ముడి పెట్టడంతో వచ్చే ఏడాది ఉపాధి కూలీలు పెరిగే అవకాశం ఉండటంతో నూతనంగా జారీ చేసే ఉపాధి కార్డులకు ప్రభుత్వం నిలిపివేసింది.పైగా గతంలో నమోదు అయి నిరుపయోగంగా ఉన్న కార్డులను రద్దు చేయడానికి ప్రభుత్వం నూతనంగా ఒక సర్క్యులర్ ను తీసుకొచ్చింది.దీంతో పని చేయాలనుకున్న కూలీలకు,కొత్తగా నమోదు చేసుకోవాలనే నిరుపేదలకు ఈ పధకం గుదిబండగా మారింది. అశ్వారావుపేట మండలంలో ప్రస్తుతం 15675 జాబ్ కార్డులు నమోదు అయి ఉన్నవి.ఇందులో ఇటీవల తీసిన లెక్కలు ప్రకారం 7865 కార్డులు మాత్రమే ఉపాధి పనులు చేసినట్లు నమోదు అయి ఉంది.ఇందులో ఇందిరమ్మ ఆత్మీయ బరోసా కు అర్హత సాధించింది 1665 మంది మాత్రమే. ఈ పధకం కారణంతో వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కార్డులకు భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉండటంతో నూతనంగా జాబ్ కార్డులు జారీ నిలిపివేసారు. అంతే గాకుండా నమోదు అయి ఉండి పడావు పడ్డ కార్డులు ను తొలగించడానికి పంచాయితీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్,సీఆర్డీ – ఈజీఎస్/ఎస్/1/1/2025 – ఎస్.పీ.ఎం స్,03/02/2025 న సర్క్యులర్ జారీ చేసారు. దీని ప్రకారం జిల్లా కలెక్టర్ లు పర్యవేక్షణలో మండలాల వారీ ,గ్రామాలు వారీ గ్రామ సభలు నిర్వహించి నమోదు అయి ఉండి, పనిచేయని ఉపాధి కార్డులను తొలగించ నున్నారు. ప్రభుత్వం ఒక కొత్త పధకం తో కొందరికే మేలు జరిగినా దాంతో ఎంతో మంది నిర్వాసితులు అవుతుంటారు అనడానికి ఇందిరమ్మ ఆత్మీయ బరోసా చక్కని ఉదాహరణ.