
మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక వినియోగం పెరిగిపోతున్న నేపథ్యం లో టెక్నాలజీని విద్యార్థులు అనివార్యంగా భా వించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న అన్నారు.విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెం పొందించడమే లక్ష్యంగా చేపట్టిన కలాం స్ఫూర్తి యాత్ర బస్సు శుక్రవారం మండలంలోని కిష్టపూర్ ప్రభుత్వ పాఠశాలకు చేరుకుంది. ఎడోడ్వాజ సంస్థ వ్యవస్థాపకుడు, సిఈఓ మధులాష్ బాబు నేతృత్వంలో ప్రారంభమైన ఫ్లో బస్సు (ఫ్యూచర్స్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మధులాష్ బాబు యువతకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా కృషి చేస్తున్నారు. ఫ్లో బస్సు, ఐ ఒ టీ, ఏ ఆర్/వి ఆర్, రోబోటిక్స్, ఏ ఐ, 3డి ప్రింటింగ్ వంటి 16 ఆధునిక సాంకేతికతలను ప్రత్యక్షంగా ప్రదర్శన ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తిని రగిలించి, విద్యార్థుల్లో ఆవిష్కరణా శక్తిని పెంచడానికి ఈ యాత్ర విశేష కృషి చేస్తోందని అన్నారు. జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు గోవర్ధన చారి ,రాజన్న, బుచ్చి లింగయ్య,ప్రకాష్ బానావత్, నగేష్,అశోక్ కుమార్,జ్యోతిశీల,నరహరిశర్మ,శ్ రీనివాస్, రజిత రాణి, కాంతయ్య, బి. శ్రీనివాస్ అజీమ్, సుస్మిత, స్వప్న మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.