నిర్లక్ష్యం చేస్తున్నారా.. ?

ఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చేసే పని, అలవాట్లే ఇందుకు కారణం. కొందరు అరికాళ్లఈ రోజుల్లో చాలా మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చేసే పని, అలవాట్లే ఇందుకు కారణం. కొందరు అరికాళ్లలో మంటలతో ఇబ్బంది పడుతుంటారు. నడుస్తున్నప్పుడు, నిలబడ్డప్పుడు, ఒక్కోసారి పడుకున్నప్పుడు కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యకు ఎలా చెక్‌ పెట్టాలో చూద్దాం.
విటమిన్‌ డెఫీషియన్సీ
ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బీ6, బీ12 లోపం వల్ల కూడా అరికాళ్లలో మంటలు పుడుతుంటాయి. జనరల్‌గా ఈ విటమిన్లు నరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒకవేళ ఇవి శరీరంలో లోపించినట్లయితే, పాదాల అడుగున మంటలతో పాటు నీరసం, ఆయాసం, బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు
పాదాలకు చెమట అధికంగా రావడం వల్ల కూడా మంటలు వస్తుంటాయి. తడి సాక్సులు ధరించి, ఇన్‌ఫెక్షన్లు వస్తే మంట పుట్టడం, దురద, ఎర్రబారడం వంటి సమస్యలు వస్తాయి.
థైరాయిడ్‌ సమస్యలు..
హైపోథైరాయిడిజం వల్ల బాడీలో మెటబాలిజం రేటుపై ఎఫెక్ట్‌ పడుతుంది. ఇది నరాలను బలహీనపర్చి కాళ్లలో మంటలకు కారణమవుతుంది.
కిడ్నీలు లేదా లివర్‌ డ్యామేజ్‌
కిడ్నీలు లేదా లివర్‌ సరిగా పనిచేయకపోతే.. విషపూరితాలు పేరుకుపోతాయి. ఇది కూడా అరికాళ్లలో మంటలకు కారణమవుతుంటుంది.
నివారణ
హెల్తీ డైట్‌ ఫాలో అవ్వాలి. విటమిన్లు, ముఖ్యంగా ‘బి’ విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. సరైన ఫుట్‌ వేర్‌ను ధరించాలి. ఎక్కువ సేపు నిలబడడం, నడవడం ఆపేయాలి. పాదాలు ఎప్పుడూ డ్రైగా, క్లీన్‌గా ఉండాలి. వీటిని పాటించినప్పటికీ.. ఇంకా సమస్య ఉంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి.