చదువే..జీవిత మార్గం..

– రెవరెస్ట్ పౌలైన్ సాగాయి రాణి

– ఉత్సహంగా సెయింట్ జోసఫ్స్ వార్షికోత్సవ వేడుకలు

నవతెలంగాణ-బెజ్జంకి 

విద్యార్థి దశ కీలకమైందని..ప్రత్యేక శ్రద్ధతో కొనసాగించే చదువే..భవిష్యత్తులో జీవితానికి మార్గమని రెవరెస్ట్ పౌలైన్ సాగాయి రాణి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో సెయింట్ జోసఫ్స్ పాఠశాల 29వ వార్షికోత్సవ వేడుకులను సిస్టర్ షాలిని అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.వార్సికోత్ఫవ వేడుకలకు ముఖ్య అతిథులుగా రెవరెస్ట్ పౌలైన్ సాగాయి రాణి హజరై రెవరెస్ట్ పాధర్ ఆరోగ్య ప్రశాంత్,రెవరెస్ట్ పాధర్ తుమ్మల సంతోష్ రెడ్డి,రెవరెస్ట్ మేరి స్టెల్లాతో కలిసి వార్షికోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు,కరాటే ప్రదర్శనలు అకట్టుకున్నాయి. బోధన సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు హాజరయ్యారు.