2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరానికి జరిగిన ప్రాణప్రతిష్టను, దశాబ్దాలుగా బయటిదాడుల్ని ఎదుర్కొన్న భారతదేశానికి ”నిజమైన స్వాతంత్య్రం”గా గుర్తుంచుకోవాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ పేర్కొన్నాడు. భారతదేశం తన సొంత కాళ్లపై నిలబడి, ప్రపంచానికి ఒక మార్గం చూపడానికే భారత్ స్వీయ శక్తిని మేల్కొలిపేందుకు రామమందిర ఉద్యమాన్ని ప్రారంభిం చామని ఆయన అన్నాడు. ప్రతీ మసీదులో శివలింగాల (శివుని చిహ్నం) కోసం వెతకాల్సిన అవసరం లేదని ప్రకటించడం ద్వారా భగవత్ డిసెంబర్ లో ఒక సంచలనం సష్టించాడు. అలాంటి శివ లింగాల కోసం వెతికేవారు మొదట, ఆయన మాటల్ని హెచ్చరికగా భావించినప్పటికీ, భారతదేశం నిజమైన విశ్వగురువు (ప్రపంచ నాయకుడు) అనే నిర్ధారణకు రావడానికి అలాంటి అదుపుచేసే మాట లు కూడా అవసరం అనే అభిప్రాయాలు వచ్చాయి.
భారతదేశం రామమందిరాన్ని నిర్మించినప్పుడు, వివిధ సందర్భాల్లో మసీదుల్ని తవ్వినప్పుడు మాత్రమే స్వీయ (వ్యక్తిగత, జాతీయ) సామర్థ్యం బయటపడుతుంది అనేది ఈ మొత్తం మాటల సారాంశ సందేశం. ఆయన మాటల ప్రకారం, సమీప భవిష్యత్తులో ఏదో ఒకరోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన జనవరి 22ను జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా రావచ్చు. అన్నిటికంటే కూడా ఇది భారతదేశ ”నిజమైన స్వాతంత్య్రానికి” ప్రారంభ మని ఆరెస్సెస్ అధినేత ప్రకటించాడు.2024వ సంవత్సరాన్ని బీజేపీ-ఆరెస్సెస్‌ల మధ్య అధికార సమతుల్యత పునరుద్ధరణ జరిగిన సంవత్సరంగా కూడా చూడవచ్చు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్ల సంఖ్యలోని ఆకస్మిక తగ్గుదల, ఆ పార్టీని సాంకేతికంగా ఒకే పార్టీ ఆధిపత్యం నుండి సంకీర్ణ ప్రభుత్వపాలనా యుగా నికి మళ్లీ వెనక్కి తీసుకొని వచ్చింది. అది, ఆరెస్సెస్ మాతత్వంలోని క్షేత్రస్థాయి కార్యకర్తలపై ఆధారపడే పరిస్థితి అవసరాన్ని పెంచింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని కొన్ని స్థానాల్లో ఆరెస్సెస్ కార్యకర్తలు భాగస్వాములు కాకపోవడం వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయినట్లు గమనించారు.
జరిగిన నష్టాల నుండి గుణపాఠాలు నేర్చుకుని, ఆ వెంటనే రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కార్యకర్తలు తమను తాము ఉత్తేజ పరచుకొని, స్పష్టమైన కార్యాచరణతో రంగంలోకి దూకారు. ఆరెస్సెస్ ఎన్నికల బూత్‌ల నిర్వహణ, క్షేత్రస్థాయిలో సమాచారం అందిం చిన ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఊహించిన హర్యానా రాష్ట్రంలో బీజేపీ విజ యం సాధించింది. అదే విధంగా మహారాష్ట్రలో కూడా అభ్యర్థులు, కార్యకర్తలు నిర్విరామంగా కషి చేశారు. రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాలున్నాయి. ఈ ప్రభుత్వాలు, నిర్మాణాత్మ కమైన ఎన్నికల అంశాలను అదుపుచేయడంలో ఉపయోగకరంగా ఉన్నాయని రుజువు చేశాయి. మొన్న ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగిన ఢిల్లీలో కూడా ఆరెస్సెస్ కార్యకర్తలు స్థానిక స్థాయి కథనాలను అదుపు చేశారు.
దీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ అనే ఒకేఒక వ్యక్తి పైనే అధికంగా ఆధారపడటం బీజేపీ సంస్థాగత ఆరోగ్యానికి మంచిది కాదనే ఒక అభిప్రాయం ఇప్పుడు సంఫ్‌ు పరివార్‌లో ఏర్పడింది. కాబట్టి, పార్లమెంట్ స్థానాల తగ్గుదల వాస్తవానికి బీజేపీ -ఆరెస్సెస్‌లకు మంచిది, అవి రెండూ కలిసి పనిచేసి అదనపు బలం పొందే అవకాశం ఉంటుంది. కొన్నినెల్లుగా ప్రతిపక్షాల పరిమితులు కూడా బహిర్గతమయ్యాయి. నిజం, ఇది సమఉజ్జీల ఆటస్థలం కాదు. కానీ భవిష్యత్తులో, తమ ప్రాంతాలపై పట్టును తిరిగి సాధించడానికి తీవ్ర పోరా టానికి సిద్ధమవుతూ, బాగా పాతుకుపోయిన పార్టీల నుండి బీజేపీకి సవాల్ వస్తుంది. రెండవ జాతీయ ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముందు అసమర్థంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఒక బలమైన క్షేత్రస్థాయి కార్యకర్తల్ని తయారు చేయకపోతే, ఊహాజనిత శత్రువుపై దాడిచేసి తన శక్తిని నిర్వీర్యం చేసినట్లవుతుంది. దానివల్ల బీజేపీకి ఒక జాతీయ ప్రత్యామ్నాయ పునర్నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న మిలియన్ల సంఖ్యలో ఉన్న భారతీయులు నిరాశ చెందుతారు.
సంకీర్ణ ప్రభుత్వయుగం తిరిగి రావడం అనేది బీజేపీ, ఆరెస్సెస్‌ల నాగరికతకు సంబంధించిన ప్రణాళికల వేగాన్నేమీ తగ్గించలేదు. వాస్తవానికి కొన్ని మార్గాల్లో ఇది మరింత తీవ్రమవుతోంది. సవాల్ ఎదురైనప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం కథనాలు, బీజేపీ, ఆరెస్సెస్ ల ప్రధాన వ్యూహంగా మిగిలి ఉంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగిన నాటి నుండి ముస్లిం మైనార్టీలను, వారి జీవితాల్ని, వారి ఆచారాల్ని, ప్రజల్ని, చరిత్రలను లక్ష్యంగా చేసుకునే వారి మౌలిక ప్రణాళిక ఏ మాత్రం వెనక్కి వెళ్లలేదు. పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాల మార్పు, మీడియా సంస్థలు, వ్యాపార సంస్థలు వారికి అనుకూలత, టీవీ ఛానెళ్లు హిందూ వర్సెస్ ముస్లింల కథనాల కోసం అత్యుత్సాహంతో కూడిన వెతుకులాట కొనసాగుతూనే ఉన్నాయి. ద్వేషపూరిత నేరాలకు ఎవర్నీ శిక్షించడం లేదు. ఎందుకంటే గతంలో ఉన్న బెదిరింపులు, రెచ్చగొట్టడాలు, ద్వేషపూరిత ప్రసంగాలు నేటికీ కొనసాగు తున్నాయి.హిందూత్వ చైతన్యానికి సామాజిక అంగీకారం, అంతరీకరణలు (ఇంటర్నలైజేషన్) కూడా ఇతర రాజకీయ పార్టీల స్థితిపై ప్రభావం చూపుతున్నాయి. మైనారిటీల ఓట్లను కోరుకుంటున్నప్పటికీ కూడా ఆ పార్టీలు ”ముస్లింల బుజ్జగింపు” అనే అంశాన్ని నివారించడానికి ఆసక్తిగా ఉంటున్నాయి.
ఒకప్పుడు మతపరమైన కథనాలకు పెద్ద ప్రతిఘటన, బాలీవుడ్ నిర్ణయించిన విధంగా ప్రజాదరణ పొందిన సంస్కతి, తెలి యని లౌకికవాదం – అంటే పాటల్లో, సంభాషణల్లో, భాషలో, స్క్రిప్ట్‌ల్లో నుండి వచ్చింది. ఇవన్నీ మైనారిటీ పాత్రలను చాలా సానుభూతితో చిత్రీకరించాయి. ఇది క్రమంగా గత దశాబ్దకాలంగా మారుతూ వస్తోంది. 2024 చివరిలో మహారాష్ట్రలో తుడిచిపెట్టిన తరువాత, ఎంతోకొంత కోల్పోయేవారు జాగ్రత్తగా ఉండటమే కాక, పాలకులు వంగమంటే వారి ముందు పాకులాడుతారు కూడా అనే సంకేతాలు తగినన్ని బాలీవుడ్ నుండి వచ్చాయి. హిందీ సినిమా రంగంలో ఓ ప్రముఖ కుటుంబం ప్రధానిని కలిసిన దశ్యాల్ని మేము ఉచితంగా చూశాం. ఇతర మెగాస్టార్ లు ప్రభుత్వానికి తమ మద్దతు అత్యవసరంగా తెలియజేసేందుకు సామాజిక మాధ్యమాన్ని, ప్రభుత్వ కార్యక్రమాల్ని ఉపయోగించు కున్నారు. ఇప్పుడు విస్తత ప్రచారంలో ఉన్న హింసాత్మక యాక్షన్ సినిమాలు మనచుట్టూ ఉన్న దేశ శత్రువుల సైద్ధాంతిక చట్రంతో తరచుగా వచ్చి చేర తాయి. బీజేపీ, సాంస్కతిక యుద్ధాలను గెలుస్తున్నట్లు కనపడుతుంది, కానీ ఇదొక దూరదష్టి లేని యుద్ధభూమి. దక్షిణాసియా, యూరోప్, చైనా, జపాన్ లాంటి ప్రగతిని సాధించిన దేశాలు ఎక్కువ మతతత్వ ధోరణులను ప్రదర్శించవు. యూరోప్, అమెరికాల్లో మితవాదం ఇతర ప్రేరణల ద్వారానే ఎక్కువగా పెరిగింది.చర్చ్‌లకు వెళ్లడం ద్వారా పెరిగిన మితవాదం తక్కువే.
మతపరమైన ఆచారాలను అనుసరించే వారి సంఖ్య తగ్గిందని అమెరికాలో జరిపిన సర్వే తెలుపుతోంది (తాము ఎంత తరచుగా చర్చ్‌కు వెళ్తారని అడిగినప్పుడు). అమెరికాలో కంటే యూరోప్‌లో మతపరమైన ఆచారాలు తక్కువ, ఇప్పుడు అదే ధోరణి కొనసాగుతోంది. భారతదేశం, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో మతతత్వం పెరుగుతుందని ‘ద ప్యూ-టెంపుల్టన్ గ్లోబల్ రిలిజియస్ ఫ్యూచర్స్ ప్రాజెక్ట్’ ఒక 2022 నివేదికలో పేర్కొంది. దీనికి విరుద్ధంగా అభివద్ధి చెందుతున్న సమాజాల్లో ప్రజలు మానవ హక్కులకు, వ్యక్తిగత స్వేచ్ఛలకు విలువనిచ్చే ఒక లౌకికవాద ధోరణి ఉంది. అయితే బీజేపీ-ఆరెస్సెస్‌లు మనల్ని దీనికి వ్యతిరేక మార్గంలోకి తీసుకుని వెళ్లాలనుకుంటున్నాయి.
సమ ఉజ్జీల క్రీడా రంగంలో విజయం సాధిస్తామన్న విశ్వాసం లేనప్పుడు బెదిరించడం, భయపెట్టడం, అణచివేయడం ద్వారా పని చెయ్యడం మోడీశకంలో బీజేపీ ప్రత్యేక లక్షణం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ ఓటమిని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధంగా వేళ్లూనుకోలేక పోతుంది. కానీ అపారమైన నిధులు, సామాజిక మాధ్యమాలను, కార్యకర్తలను ఉపయోగించి బీజేపీ ఇప్పటికీ ప్రతీచోటా ఉండేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాంతాల్లో తన ముద్ర వేయడానికి తన మతతత్వ సందేశాలను ఉపయోగిస్తూనే ఉన్నది. రాజ్యమే, రాజ్యంలో మతోన్మాద, మతపరమైన ఉత్సాహాన్ని సష్టించే బీజేపీ, ఆరెస్సెస్‌ల అనుకూల ఆధిపత్య వ్యూహం భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తుందా లేక వాస్తవానికి దాని అభివద్ధి మార్గంలో అడ్డంకిగా మారుతుందా అని ఎవరైనా ఆశ్చర్యానికి గురవుతారు.
(”ఫ్రంట్ లైన్” సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్, 9848412451
సబా నఖ్వీ