ఎన్‌ఎస్‌ఈలో మాగెల్లానిక్‌ క్లౌడ్‌ లిస్టింగ్‌

Magellanic Cloud Listing on NSEముంబయి : నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఈ)లో మాగెల్లానిక్‌ క్లౌడ్‌ లిమిటెడ్‌ లిస్టింగ్‌ అయ్యింది. ఇది సాంకేతిక రంగంలో అసాధారణమైన వృద్ధి, కంపెనీ అవిశ్రాంత ప్రయత్నాలకు నిదర్శనమని ఆ సంస్థ పేర్కొంది. ఇది తమకు కొత్త అధ్యాయంగా నిలవటంతో పాటుగా సాంకేతిక రంగంలో తమ స్థానాన్ని బలోపేతం చేసే ఒక చోదక శక్తిగా ఉంటుందని మాగెల్లానిక్‌ క్లౌడ్‌ గ్లోబల్‌ సీఈఓ, ఎండీ జోసెఫ్‌ సుధీర్‌ తుమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది తమ ఆధిక్యతకు దోహదం చేయనుందన్నారు. ఈ సంస్థ ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, గ్రోన్‌ తయారీలో ప్రత్యేకతలను కలిగి ఉంది.