మహిళా కండక్టర్తో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరిపై కేసు నమోదు

A case has been registered against the two for misbehaving with the female conductor– చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– రామగిరి ఎస్పై పెట్టం చంద్రకుమార్
నవతెలంగాణ – రామగిరి 
ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపే క్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని రామగిరి ఎస్సై పెట్టం చంద్రకుమార్ హెచ్చరిం చారు. రామగిరి ఎస్సై పెట్టం చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్తో దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ నుండి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రోజు రాత్రి 9.00 గంటల సమయంలో సెంటినరీ కాలనీలోని తెలంగాణ చౌరస్తా వరకు చేరుకునే సరికి మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కారును ర్యాష్ గా నడుపుకుంటూ వచ్చి బస్సుకు అడ్డంగా పెట్టి బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగడంతో అడ్డుగా వెళ్లినటువంటి కండక్టర్పై దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యానికి దిగడంతో అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ విషయమై ఆర్టీసీ కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమాన్పూర్ మండలం గుండారం గ్రామనికి చెందిన రాచకొండ రవి, మోతె రాజయ్యలపై కేసు నమోదు చేసి కారు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.