
– యూనివర్సిటీ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వేంటనే విడుదల చేయాలని,బడ్జెట్లో తెలంగాణా యూనివర్సిటీ కి 500 ల కొట్లా నిధులనూ కేటాయించి ఇంజనీరింగ్ విద్యకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లా ఊసే ఎత్తకపోవడం దారుణమని అన్నారు. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు బిక్షం ఎత్తుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రవేట్ డిగ్రీ యాజమాన్యాలు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల కాకపోవడం తో వారి జీవితాలు అగమ్య గోచరంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే స్కాలర్షిప్ ఫీజు రిబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ యూనివర్సిటీ కి కనీసం 500 వందల కోట్ల రూపాయలు కేటాయించి వర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ యూనివర్సిటీ కీ ఇంజినీరింగ్ విద్యకు శ్రీకారం చుట్టాలని, లేకపోతే భవిష్యత్తులో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఇల్లు ముట్టడికి వెనకాడబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజకుమార్, యూనివర్సిటీ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు పృథ్వి, సంతోష్, నిరంజన్, నాగేంద్ర, స్వామి, జీషన్, చరణ్, సాగర్, చక్రి ,వినీత్ తదితరులు పాల్గొన్నారు.