నవతెలంగాణ – ఆర్మూర్
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజూర గ్రామవాసి తిమ్మరాశి సాయినాథ్ దుబాయ్ కి ఉపాధికై వెళ్ళిన నాలుగు రోజులకే తప్పిపోయాడు. దుబాయ్ లోని జబ్లాలి ప్రాంతంలో ఒక కంపెనీలో చేరి మూడు రోజులు మాత్రమే పనిచేసి ఈ నెల 1వ తేదీ నుండి కనిపించడం లేదనీ, సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శనివారం ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ను కలిసినారు. ఈ సందర్భంగా సాయినాథ్ ను వెతికి ఇంటికి రప్పించాల్సిందిగా వేడుకున్నారు. వెంటనే స్పందించి అక్కడి ఇండియన్ ఎంబసికి , ఎం ఆర్ డబ్ల్యు ఎఫ్ దుబాయ్ శాఖ కోఆర్డినేటర్ జంగం బాలకిషన్ కు సమాచారం పంపించి అక్కడి కార్యకర్తల సహాయంతో వెతికి పెట్టాల్సిందిగా కోరారు. బాలకిషన్ వెంటనే రంగంలోకి దిగి వెతుకుతున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు గుల్ ఫారం కల్లు తాగే అలవాటు ఉన్న వ్యక్తులను గల్ఫ్ కు పంపేముందు కొంతకాలం అలవాటు మాన్పించి నిర్ధారణ చేసుకొని మాత్రమే పంపే విధంగా ఏజంట్ల పై చర్యలు తీసుకొని ప్రభుత్వం నియంత్రించాల్సిందిగా కోటపాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.