మంత్రి పొన్నంకు మీడియా డైరీ..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పర్యటనకు విచ్చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు 2025 నూతన సంవత్సర, టియూడబ్ల్యూజే (ఐజేయు) మీడియా డైరీ ని శనివారం  పొన్నం ప్రభాకర్ కు  యూనియన్ జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి నూగూరి మహేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంప మహేష్ లతో కలిసి డైరీ ని  అందజేశారు.డైరీని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పాత్రికేయులకూ,పాత్రికేయేతరులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేలా, సమగ్ర సమాచారంతో, వినూత్న రీతిలో మీడియా డైరీని తీసురావడం అభినందనీయమన్నారు.