తన భర్త బతికినట్టా..! చచ్చినట్టా 

– అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లి అదృశ్యమైన శంకర్
– భర్త ఆచూకీ కోసం 5 నెలలుగా భార్య ఎదురుచూపులు 
– ఐదుగురు పిల్లల పోషణ భారంగా మారింది బాధిత  మహిళా ఆవేదన.
నవతెలంగాణ – అచ్చంపేట : అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్లిన నిమ్మల శంకర్ అదృశ్యమయ్యాడు. అటవీ శాఖ అధికారులు, పోలీసులు, గ్రామస్తులు రెండు నెలలపాటు అడవిలో అణువును  గాలించారు కానీ ఆచూకీ లభించలేదు. భర్త ఆచూకీ  కోసం భార్య ఎదురుచూస్తుంది. వివరాల ప్రకారం లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్ర పెంట చెంచు గ్రామానికి చెందిన శంకర్ శివ లీల దంపతులు కూలి పని చేస్తూ ఆట ఉత్పత్తుల సేకరిస్తూ జీవనం గడుపుతున్నారు.  వీరికి ఐదు మంది పిల్లలు సంతానం  జయ శ్రీదేవి, శ్రీదేవి కవలలుగా జన్మించారు. 9 సంవత్సరాలు , అనురాధ 6, ఆకాష్ 2, మళ్లీ ప్రస్తుతం 6 నెలల బాబు ఉన్నాడు  5 నెలల క్రితం అటవీ ఉత్పత్తుల సేకరణకు  అడవిలోకి వెళ్ళాడు. నేటికీ ఆచూకీ లభించలేదు. దీంతో శంకర్  తల్లి ఈదమ్మ  బెంగతో మంచం పట్టింది. 15 రోజుల క్రితం చనిపోయింది. ఆసరాగా ఉంటుందనుకున్న అత్త కూడ చనిపోవడంతో ఐదు మంది పిల్లల పోషణ ఆలనా  పోషణ  శివలీలకు భారంగా మారింది  పట్టించుకోవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తన భర్త ఉన్నట్టా. చచ్చినట్టా  నేను తాళిబొట్టు ఉంచాలా తీసేయాలనా.. ఏమి చేయాలో అంత చిక్కడం లేదని  కన్నీరు పెట్టుకుంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పిల్లలకు ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు అని శివ లీల  ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇద్దరు నార్లాపూర్ గిరిజన హాస్టల్లో చేర్చింది. మిగిలిన ముగ్గురు పిల్లలతో  ఇంటి వద్ద ఉంటుంది. తన పిల్లలు ఎదిగే వరకు ప్రభుత్వం,, అధికారులు నన్ను ఆదుకోవాలని వేడుకుంటుంది.