ఆదిలాబాద్ లో 11న మహిళలకు జాబ్ మేళా

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 11 టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన జీఎల్ఐటీజెడ్ కార్ప్ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డా.అతీక్ బేగం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి 10వ తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసుకున్న మహిళ అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. వారికి 18 నుండి 27 సంవత్సరాల వయస్సు ఉండాలని. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.15వేల జీతంతో పాటు, మధ్యాహ్న భోజనం, హైదరాబాద్ లో రవాణా సౌకర్యం, హాస్టల్ వసతికి నెలకు అలవెన్సులు ఉంటాయని పేర్కొన్నారు. మహిళ అభ్యర్థులు కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్తులు తమ సర్టిఫికెట్లతో, ఆధార్, పాన్ కార్డుల తో ఈనెల 11 న ఉదయం 10 గంటలకు కళాశాల ప్రాంగణంలో హాజరు కావాలని సూచించారు.. మరిన్ని వివరాలకు టీఎస్.కేసి కో-ఆర్డినేటర్ డా. కోటయ్య, మెంటర్ చైతన్య, 9885762227 నంబర్ ను సంప్రదించాలని కోరారు.