
భారత విద్యార్థి ఫెడరేషన్ అహర్నిశలు విద్యార్థుల సమస్యల కోసం విద్యార్థుల పట్ల విద్యార్థులతో కలిసి పనిచేస్తుందన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, పెండింగ్లో ఉన్న కాస్కాస్మేటిక్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేక సమరశీల పోరాటాలు చేస్తున్నామని వారు అన్నారు విద్యార్థుల పక్షాన విద్యార్థుల వెనువెంట ఉండి పనిచేసే సంఘమని వారు చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థుల సంరక్షణ కోసం విద్యార్థుల సమస్యల పట్ల అలుపెరగని పోరాటాలు చేయాలని నూతన కమిటీకి సూచించారు.