
మహిళా కూలీ అదృశ్యమైన ఘటన దుబ్బాక పట్టణ కేంద్రంలో శనివారం జరిగింది.ఎస్ఐ వీ.గంగరాజు తెలిపిన వివరాలు.. పట్టణ కేంద్రానికి చెందిన కారంకంటి గంగ (45) అనే మహిళ.. కూలీ పని చేస్తూ కూతురితో కలిసి ఉంటుంది.రోజులాగే శనివారం ఉదయం కూలీ పనికి వెళుతున్నానని చెప్పి కనబడకుండా పోయింది.ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లేదు.గంగ కుమార్తె వీణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.