పిల్లల ఉపాధ్యాయులైన వేళ…

నవతెలంగాణ – చండూరు  :  స్థానిక  జడ్పీహెచ్ఎస్  హై  స్కూల్ లో స్వపరిపాలన దినోత్సవం శనివారం  ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలుగా మానస, కలెక్టర్ గా లావణ్య డీఈవోగా సాక్షి ఎంపీడీవో గా అర్చన ఎంఈఓ గా అలేఖ్య   విద్యార్థులు ఒకరోజు అధికారులుగా విధులు నిర్వహించారు.  పాఠశాలలో  సమస్యలను పరిష్కరించుటకు సలహాలు ఇచ్చారు. పోలా సాయికుమార్ గన్ మేన్ గా, భార్గవ్ రామ్ ఫిజికల్ డైరెక్టర్ లు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉపాధ్యాయులు గా విద్యార్థులు  వివిధ అంశాలను బోధన పరికరాలను ఉపయోగించి ఆకట్టుకునే విధంగా బోధించారు. సాయంత్రం జరిగిన సమావేశంలో వారి అనుభవాలను ఇతర విద్యార్థులతో, ఉపాధ్యాయులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వెన్నంటి ఉండి విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.