
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం (టిఆర్పీఎస్)మండల అధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన జల్లారపు ప్రసాద్ ను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎలగొండ రాజేంద్రప్రసాద్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో టిఆర్పీఎస్ అధ్యక్షులుగా నియమించిన జిల్లా అధ్యక్షులు ఎలగొండ రాజేంద్రప్రసాద్ కు జిల్లా, రాష్ట్ర కార్యవర్గ నాయకులకు ప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పద్మశాలిల ఐక్యతకు,సంఘ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్డగట్ల శ్రీధర్, రాష్ట్ర నాయకులు ముడితనపెల్లి ప్రభాకర్, కొలిపాక ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు కుసుమ శ్యాం ప్రసాద్, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతం అనీల్ కుమార్ పాల్గొన్నారు.