
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రంలోని జెడ్పి హెచ్ ఉన్నత పాఠశాల 1992-93 సంవత్సరం పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక మల్లిఖార్జున ఫంక్షన్ హాల్లో చదువుల తల్లి సరస్వతి దేవీ జ్యోతి ప్రజ్వలన చేసి జరుపుకున్నారు 32 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ఆనాటి గురువులు వడ్లపల్లి నర్సిరెడ్డి, వంగాల కృష్ణారెడ్డి,సీతారమశర్మ సీతాకల్యాణి, సుజాత,ప్రస్తుత పెద్దవూర జెడ్పిహెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు తరి రాము, పూర్వవిద్యార్ది రాష్ట్ర ప్రబుత్వం అదనపు న్యాయసలహాదారు తేర రజనీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ చదువుకున్న పాఠశాలకు 20,000 రూపాయల విలువైన ఆహుజ సౌండ్ సిస్టం ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరి రాముకి బహుకరించారు.అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుండి ప్రతి సంవత్సరం 10 వ తరగతి పబ్లిక్ పరీక్ష లో ప్రథమస్థానం పొందినవారికి 10,000 రూపాయలు 92౼93బ్యాట్చ్ తరుపున ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి విద్యార్థులు అయిన ఇరుమాది పాపిరెడ్డి, భీమ్లానాయక్, నడ్డిఆంజనేయులు, కిషన్, శ్రీనివా